నాని ఎందుక‌లా ట్వీట్ చేశాడు? అస‌లు మ్యాట‌రేంటో?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ఖ్యంగా ఈ మ‌ధ్య తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం ఓటీటీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో..థియేటర్‌ అసోసియేషన్లు ఆయ‌న మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే స‌మ‌యంతో నానితో పాటు ట‌క్ జ‌గ‌దీశ్ యూనిట్‌కు చాలా మంది మ‌ద్ధ‌తు ప‌లికారు.

దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్క‌డితో ఆ గొడ‌వ సద్దుమణిగింది. అయితే తాజాగా నాని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ‘రేపు’ (Tomorrow) అని ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. నాని ఎందుక‌లా ట్వీట్ చేశాడు? అస‌లు ఆయ‌న ట్వీట్ వెన‌కున్న మ్యాట‌రేంటీ..? అన్న విష‌యాలు తెల‌య‌వు.

కానీ, ఈ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ నాని ట్వీట్‌ చేసినట్లు రేపు ఎలాంటి ప్రకటన రానుందన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. కాగా, నాని చేస్తున్న చిత్రాల్లో ట‌క్ జ‌గ‌దీశ్‌, శ్యామ్ సింగ‌రాయ్ మ‌రియు అంటే సుందరానికి..! ఉన్నాయి. వీటిలో ట‌క్ జ‌గ‌దీశ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మిగిలిన రెండూ సెట్స్‌పై ఉన్నాయి. మ‌రి ఈ మూడిటిలో ఏ సినిమా నుంచి ఏం అప్డేట్ వ‌స్తుందో చూడాలి.

https://twitter.com/NameisNani/status/1430775655885537280?s=20