ఆ డైరెక్ట‌ర్ కోసం ప‌వ‌న్ మూవీకి ఓకే చెప్పిన బుట్ట‌బొమ్మ‌..?

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, త‌మ‌ళ్ భాష‌ల్లోనూ వ‌రుస చిత్రాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మ‌రి సినిమా చేరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

PSPK 28 first look poster out: Pawan Kalyan teams up with Harish Shankar  for new film - Movies News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌న్న‌ విషయం కూడా స్పష్టమైంది.

Pooja Hegde: It's tough to play a stand-up comedian in a movie | Hindi  Movie News - Times of India

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా పూజా హెగ్డేను సంప్ర‌దించార‌ట‌. అయితే ప్ర‌స్తుతం ఆమె చేతుల్లో చాలా చిత్రాలే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ హరీశ్ శంకర్ కోసం పూజా హెగ్డే ప‌వ‌న్ మూవీకి ఓకే చెప్పేసింద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న సైతం రాబోతోంద‌ట‌. కాగా, కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన పూజాను `దువ్వాడ జగన్నాథం` తో హారిశ్ శంక‌రే హిట్ ట్రాక్ ఎక్కించాడు. ఇక ఆ త‌ర్వాత మ‌న ఈ బుట్టబొమ్మ వెనుతిరిగి చూసుకోలేదు.