మహిళలకు మోడి సర్కార్ గుడ్ న్యూస్..?

గ్యాస్ సిలిండర్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. ఆగస్టు10వ తేదిన ఉజ్జ్వల యోజన రెండో దశను మోడీ ప్రారంభించనున్నారు. పేదరికానికి దిగువన ఉండే స్త్రీలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పథకం 2016వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో 5 కోట్ల బీపీఎల్ ఫ్యామిలీస్ కు ఈ గ్యాస్ కనెక్షన్లు అందాయి. 2018వ సంవత్సరంలో ఈ స్కీమ్ ఇతర ప్రాంతాలకు చేరువయ్యింది. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలనేది ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం.

2019వ సంవత్సరం ఆగస్టులోనే వారు అనుకున్న ఈ లక్ష్యాన్ని సాధించేశారు. తాజాగా ఇప్పుడు ఉజ్వల 2.0 కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ లో భాగంగా మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ లను ఇవ్వనున్నారు. దీనికి ఎటువంటి రేషన్ కార్డు నివాస ద్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్ వల్ల పేదరికానికి దిగువన ఉన్న మహిళలకు ప్రయోజనం ఉంటుంది.