నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి…!

August 9, 2021 at 11:38 am

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ నటులు ప్రాణాలను విడుస్తున్నారు. అనారోగ్య సమస్యలతో కొందరు, కరోనా సోకి ఇంకొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు కన్నుమూశారు. తాజాగా ఓ సీనియర్ నటుడు కాలం చేశారు. హిందీలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అనుపమ్‌ శ్యామ్‌ తుది శ్వాస విడిచారు. 63 ఏళ్ల అనుపమ్‌ శ్యామ్‌ కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో చికిత్స తీసుకుంటున్నాడు.

కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే డయాలసిస్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులకు ముందు ఆయనకు తీవ్రంగా నొప్పి కలిగింది. ముంబైలోని లైఫ్‌లైన్‌ హాస్పిటల్ లో ఆయనకు చికిత్స చేస్తుండగా నిన్నరాత్రి ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఆసుప్రతిలో జాయిన్ చేశారు. ఈయన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు, క్వీన్‌ లాంటి మూవీస్ లో కూడా నటించారు. అనుపమ్ శ్యామ్ కు పలువురు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సహనటులు, సీరియల్ నటీమణులు మౌనం పాటించారు.

నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts