లవ్ స్టోరీ సినిమా మళ్లీ వాయిదా పడిందా..? కారణం..!

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.నాగచైతన్య ఈ మధ్య ఒక చిత్రంలో నటించగా ఆ చిత్రం చాలా అడ్డంకులు వేస్తుంది. ఆ చిత్రం ఏదో కాదు లవ్ స్టోరీ.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ఇంతకుముందే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తోంది.ఈక మరోసారి కూడా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పుడొచ్చే సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదల కావాల్సివుంది.కానీ కొన్ని అన్యోన్య కారణాల చేత విడుదల కాలేకపోతుదంటు ఇప్పుడు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాని నిర్మాతలే వాయిదా వేశారని సినీ ఇండస్ట్రీలో వినికిడి.

ఈ సినిమా వాయిదాకు సంబంధించి త్వరలో అధికారి క ప్రకటన రానుందని తెలుస్తోందిఅంతేకాకుండా ఏపీలో టికెట్ రేట్లు పెరగాల్సి ఉన్నా ఇంకా పెరగలేదు. పెరుగుతాయో లేవో కూడా అర్థం కావటం లేదు.సెకండ్ షోలకి కూడా ఏపీలో అనుమతి రాలేదు.కరోనా కేసులు తగ్గిన కూడా ప్రేక్షకులు ఎక్కువగా సినిమా థియేటర్ల వైపు ఆసక్తి చూపటం లేదు.అందుచేతనే వీరు ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ సినిమా బాగుంటేనే మాత్రం ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగు వేస్తున్నారు. ఇక లవ్ స్టోరీ సినిమా వాయిదా పడుకుంటే అదే రోజున ఓటిటి లో టక్ జగదీష్ సినిమా కూడా విడుదల కానుంది.ఇక అంతే కాకుండా నాని ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటం వల్ల, లవ్ స్టోరీ సినిమాని పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదని తెలుస్తోంది.