నాగార్జున కొత్త సినిమా.. ఫ్రీ లుక్ మాములుగా లేదుగా!

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి చిత్ర బృందం ఫీలింగ్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ఎల్ఎల్పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై ప్రముఖ నిర్మాత లు నారాయణ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే నిన్న ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫ్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నాగార్జున రక్తంతో తడిసిన కత్తిని చేత పట్టుకొని వర్షంలో నిలబడి ఉన్నాడు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తుంటే సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఈ సినిమా నుంచి ఈ నెల 29 నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.