హాట్ డాన్స్ తో రెచ్చి పోతున్న ప్రముఖ యాంకర్…?

టీవీ యాంకర్లు వరుస ఆఫర్లతో బిజీగా అయిపోతున్నారు. డబ్బులు రెండు చేతులా సంపాదిస్తూ పాపులారిటీ సంపాదిస్తున్నారు. చాలా మంది యాంకర్లు అటు బుల్లి తెరపై ఇటు పెద్ద తెరపై తమ అదృష్టం పరీక్షించుకుని స్టార్లుగా ఎదిగారు. ఝాన్సీ, సుమ, శిల్పా చక్రవర్తి వంటివారు ఈ కోవకు చెందుతారు. వీరు ముందుతరం యాంకర్లుగా ఖ్యాతి పొందారు. ఇప్పుడు యాంకర్ అనసూయ, రేష్మి గౌతమ్ దూసుకుపోతున్నారు. సీనియర్ల రూట్ లో వెళ్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇపుడు తాజాగా యాంకర్ విష్ణుప్రియ కూడా ఆ లైన్ లోకి చేరిపోయింది.

ఓవైపు బుల్లితెర హోస్ట్ గా చేస్తూనే మరో వైపు సినిమాల్లో కథనాయికగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ హాట్ యాంకర్ కు సోషల్ మీడియాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదివరకూ విష్ణు ప్రియ వండర్ ఉమెన్ గెటప్ తో అందరి అటెన్షన్ ని తనవైపు లాగింది. ఫోటో షూట్లతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. జన్మాష్ఠమి వైబ్స్ , అలాగే నా ఫేవరెట్ సండే అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది.