పాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు..పృథ్వీ సంచలన వ్యాఖ్యలు?

తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతను ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, కమెడియన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగుతో కమెడియన్ గా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ పాన్ ఇండియా సినిమాల ప్రారంభోత్సవాలకు మమ్మల్ని పిలవరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన కాలం రాసిన కథలు సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ సినిమాల్లో చిన్న పెద్ద అనేది ఉండదు. ఏ సినిమాకి అయినా కూడా ఒకే కెమెరా ఒకే కష్టం ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమాలో వెన్నెల, రీతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం కాలం రాసిన కథలు. ఈ సినిమా తొలి సీన్ కి వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పృథ్వి రాజ్ క్లాప్ ఇచ్చారు. అలాగే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వని ధైర్యం కుటుంబం మాత్రమే ఇవ్వగలదు అనేదే కాలం రాసిన కథలు సినిమా అని తెలిపాడు పృథ్వీరాజ్.