పవన్ హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఆ రోజేనా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుపాటి రానా మల్టీ స్టారర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల ప్రకటన చేశారు.

ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో చిత్రం రూపొందనుంది. గబ్బర్ సింగ్ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ కాంబో రెండోసారి రిపీట్ కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఏంటో తెలియాలి అంటే సెప్టెంబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.