ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?

July 18, 2021 at 9:14 am

మెగా కోడ‌లు ఉపాస‌న ఇంట త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయ‌ట‌. ఉపాస‌న చెల్లెలు, రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

Upasana Kamineni Konidela Wiki, Age, Boyfriend, Husband, Family, Biography  & More - TheWikiFeed

ప్ర‌స్తుతం అనుష్ప‌ల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్‌లో చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో ఈమెకు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్ప‌ల‌.

Upasana's Sister To Marry Athlete -

అయితే తాజాగా అనుష్పాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ లవ్ ఎమోజి పెట్టింది. దాంతో ఈ జోడీ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని, ఇప్ప‌టికే నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని అంటున్నారు. మ‌రోవైపు సినీ సెల‌బ్రెటీలు సైతం ఈ జోడీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వ‌ర‌లోనే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts