కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ ఎక్కిన అమెరిక‌న్‌..వీడియో వైర‌ల్‌!

July 18, 2021 at 8:41 am

గిన్నిస్ బుక్ ఎక్క‌డం అంటే మామూలు విష‌య‌మా.. ఏదో ఒక అరుదైన అద్భుతం చేస్తేనే గానీ ఆ అదృష్టం ల‌భించ‌దు. అయితే తాజాగా ఓ అమెరిక‌న్ కూల్ డ్రింక్ తాగి.. గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

అమెరికా పౌరుడు ఎరిక్ బ్యాడ్ లాండ్స్ బూకర్ అనే వ్య‌క్తి.. రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఓ జార్‌లో పోసుకుని.. కేవలం 18.45 సెకన్లలోనే తాగేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

అయితే రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఇంత ఫాస్ట్‌గా ఎవరూ తాగలేద‌ని గుర్తించిన గిన్నిస్ బుక్ వారు.. ఎరిక్ టాలెంట్‌ను మెచ్చి అత‌డికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని ఇచ్చారు. మ‌రి ఎరిక్ టాలెంట్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

కూల్ డ్రింక్ తాగి గిన్నిస్ బుక్ ఎక్కిన అమెరిక‌న్‌..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts