దుల్కర్‌ సల్మాన్ మూవీలో అక్కినేని హీరో కీ రోల్‌?!

మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఆయ‌న సినిమాలు తెలుగులోనూ రూపొందుతుంటాయి. ప్ర‌స్తుతం దుల్క‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్‌ ఓ కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌.

సినిమాలో ఆయన పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంద‌ని, హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్రని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అందులో సుమంత్‌ కూడా పాల్గొంటున్నార‌ని టాక్‌.