`రాక్షసుడు` సీక్వెల్..రంగంలోకి స్టార్ హీరో?!

బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన రాక్షసుడు 2019లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.

తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాక్షసుడు 2 సినిమాకి హోల్డ్ యువర్ బ్రీత్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ఖిలాడి సినిమా చేస్తున్న ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌.. ఆ వెంట‌నే రాక్ష‌సుడు 2ను తెర‌కెక్కించ‌నున్నాడు.

అయితే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ కాకుండా.. మ‌రో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారు. ఆ హీరో వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ రివిల్ చేయ‌నుంది. కాగా, ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌ ఫిల్మ్స్ పతాకంపై, హవీష్‌ ప్రొడక్షన్‌లో కోణేరు సత్యానారాయణ నిర్మిస్తున్నారు.