మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికే విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. తాజాగా నార‌ప్ప స‌క్సెస్ మీట్‌లో పాల్గొన్న వెంకీనే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఎఫ్ 2 సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

మ‌రోవైపు అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు ఉంది. అందువ‌ల్ల‌నే ఎఫ్ 3ని సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని న‌మ్ముతున్నార‌ట‌. కాగా, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌, ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, ప‌వ‌న్ – రానా ల రీమేక్ మూవీ విడుద‌ల కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో పెద్ద సినిమా ఎఫ్ 3 చేర‌డంతో.. ఈ సారి అభిమానుల‌కు పండ‌గ అదిరిపోతుంద‌ని సినీ ప్రియులు భావిస్తున్నారు.