అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్‌ గుడ్‌బై..ఎందుకంటే..?

ప్రపంచ మార్కెట్ దిగ్గ‌జం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్ర‌స్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్‌బై చెప్పేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్ర‌తి ఒక్క‌రిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్ర‌స్తుతం అంతరిక్షంపై పడింద‌ని స‌మాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయ‌న ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. దీన్ని రూపొందించిన స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెలలో ఆయన స్పేస్‌లోకి వెళ్లబోతున్నాట్టు స‌మాచారం.

అంతే కాదు భవిష్యత్తులో కూడా ఎక్కువ సమయాన్ని ఆయన దీనికోసమే కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇక దాతృత్వ కార్యక్రమాలపైనా కూడా మరింత దృష్టి సారించనున్నారు బెజోస్‌. బెజోస్ ఇప్పటికే వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఓనర్ గా కూడా ఉన్నారు. వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు బెజోస్‌.