తండ్రి కాబోతున్న జ‌గ‌ప‌తిబాబు..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

June 14, 2021 at 8:07 am

జ‌గ‌ప‌తిబాబు తండ్రి కాబోతున్నాడ‌ట‌. ఈ వ‌య‌సులో తండ్రి కావ‌డం ఏంటీ? అన్న అనుమానం మీకు వ‌చ్చే ఉంటుంది. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒక‌ప్పుడు సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు.

దీంతో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫ‌ర్ త‌లుపుత‌ట్టింద‌ని..స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఓ చిత్రంలో కీల‌క పాత్ర కోసం ఆయ‌న‌ను ఎంపిక చేశార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌కు సంబంధించి ఓ వార్త బాలీవుడ్ వ‌ర్గాల్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో అక్షయ్‌కు తండ్రిగా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నాడ‌ట. తండ్రి పాత్ర అయిన‌ప్ప‌టికీ.. సినిమాకు చాలా కీల‌కంగా ఉంటుంద‌ని, స్క్రీన్ టైమ్‌ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

తండ్రి కాబోతున్న జ‌గ‌ప‌తిబాబు..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts