సరికొత్త ఫీచర్ తో గూగుల్ మీట్‌..!

కరోనా లాక్‌డౌన్ సమయంలో వీడియో కాల్స్ వినియోగించడం బాగా పెరిగింది. కంపెనీల ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు వీడియోకాల్స్ సేవలు పొందుతున్నారు. అయితే గూగుల్ మీట్‌లో పూర్ కనెక్షన్ కారణంగా కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు. మీటింగ్ మధ్యలో పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్‌ ఆప్షన్‌ మెనూ బబుల్‌ కూడా వస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే ట్రబుల్‌షూట్‌, హెల్ప్‌ ఆప్షన్‌ వస్తుంది.ఈ ఆప్షన్‌ను ఎంచుకోగానే పూర్‌ కనెక్షన్‌ సమస్యను పరిష్కరించే రికమండేషన్స్‌ అక్కడ కనిపిస్తాయి. వాటిని ఫాలో అవడం ద్వారా పూర్‌ కనెక్షన్‌ సమస్య పరిష్కారం అవుతుందని గూగుల్‌​ చెబుతున్నది. గూగుల్ లో ఇటువంటి ఫీచర్ రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ యూజర్ల కోసం గూగుల్ ఇటువంటి ఫీచర్స్ తీసుకురావడం పట్ల సంతోషం చెందుతున్నారు.