డ‌బ్బులు ఇస్తే వీడియో పంపుతానంటున్న చిన్మయి!?

May 25, 2021 at 8:24 am

టాలెంటెడ్ సింగర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గొంతుతో అనేక పాటలు పాడిన చిన్మ‌యి.. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి అవకాశం వచ్చినప్పుడల్లా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సేవా కార్యక్రమాల్లో కూడా చిన్మయి ముందుంటుంది. ఎంద‌రికో విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిని కల్పించేందుకు చిన్మయి పాటుపడుతోంది. అలాగే దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలని కోరుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా.. తాను కొన్ని కుటుంబాలకు సహాయం చేయాలి, కొంత మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని, అందులో ఒక మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నారు. మీకు ఏదైనా ఇష్టమైన పాట పాడి వీడియో పంపుతా, లేదా మీకు ఇష్టమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మరేదైనా శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో చేస్తా. మీరు బదులుగా నాకు డబ్బులు పంపండి అంటూ చిన్న‌యి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

డ‌బ్బులు ఇస్తే వీడియో పంపుతానంటున్న చిన్మయి!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts