చిరు కీల‌క నిర్ణ‌యం..ఆచార్య త‌ర్వాత అలా..?

May 25, 2021 at 8:56 am

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది.

ఇక ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మ‌రియు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. చిరు ఓ కీలక నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా.. ఆచార్య బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసేసి ఆ త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్నార‌ట‌. నిజానికి ఆచార్య త‌ర్వాత లూసీఫ‌ర్ రీమేక్‌, వేదాళం రీమేక్ సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, ఈ సినిమాలు చేసేందుకు మ‌రికొంత స‌మ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట చిరు. వ‌చ్చే ఏడాది రెండు సినిమాల‌ను మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు టాక్‌.

చిరు కీల‌క నిర్ణ‌యం..ఆచార్య త‌ర్వాత అలా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts