మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!

May 25, 2021 at 8:03 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఇటీవ‌లె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా స‌ర్కారు వారి పాట టీజ‌ర్ వ‌స్తుంద‌ని అభిమానులు భావించారు. మేక‌ర్స్ కూడా ఈ వైపుగా సూచ‌న‌లు చేశారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. టీజ‌ర్ అప్డేట్ లేన‌ట్టే అని తెలుస్తోంది.

టీజర్‌ కట్‌ చేసేందుకు సరిపడ ఫుటేజ్‌ లేదని, అందుకోసమే మూవీ టీం టీజర్‌ విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే టీజర్‌ కాకుండా ఓ ఫొటో పోస్టర్‌ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్టే అవుతుంది.

మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts