మే 5 నుంచి లాక్‌డౌన్‌..ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా వైగంలో జోరు త‌గ్గ‌డం లేదు. దీంతో చేసేదేమి లేక ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం కూడా లాక్‌డౌన్ విధించింది.

మే 5 నుంచి 15 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మే 5 నుంచి మే 19 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో మే 5 నుంచి మే 19 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.