అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!

May 2, 2021 at 11:53 am

బీజేపీ అస్సాంలో విజ‌యం దిశ‌గా ప‌రుగులు తీస్తున్న‌ది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్య‌త‌ను చాటుకుంటున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాల‌కు ఎగ‌బాకింది. అక్క‌డి అధికార టీఎంసీ పార్టీకి స‌వాల్‌గా నిలిచింది. ఇంత‌గా యావ‌త్ భార‌తదేశ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డిపోయింది. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారి పోయింది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మూడుస్థానంలో కొన‌సాగుతుండ‌గా అక్క‌డ కేవ‌లం 15వేల ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రం ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో అనూహ్య విజ‌యం సాధించ‌డంతో పాటు , జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్‌కు గ‌ట్టి షాక్‌ను ఇచ్చింది. నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ ఇదే దూకుడును క‌న‌బ‌రుస్తుంద‌ని ఆశించినా క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఉప ఎన్నిక‌లో డిపాజిట్‌ను కూడా ద‌క్కే అవ‌కాశాలు లేకుండా పోయాయి. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది ర‌రౌండ్లు పూర్తి కాగా, కేవ‌లం 4446 ఓట్ల‌ను మాత్ర‌మే బీజేపీ అభ్య‌ర్థి సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇక టీఆరెస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్నారు.

అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts