అన్ని షూటింగ్ లు బంద్ అయినా.. కానీ నాని సినిమా మాత్రం..?

May 2, 2021 at 2:50 pm

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు కేసులు బాగా పెరిగిపోవటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించారు. కొన్ని రాష్ట్రలో స్వీయ లొక్డౌన్ కూడా పాటిస్తుంది. దీనితో అందరు మూవీ షూటింగ్ లు కూడా ఆపేశారు. కానీ నానీ నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ మూవీ షూటింగ్ మాత్రం ఆగకుండా కొనసాగుతోంది. అందుకు ఒక ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే, దాదాపు 6 కోట్ల వ్యయంతో ఫిల్మ్ సిటీలో కలకత్తా సెట్ వేసి చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు అన్ని పాటిస్తూ ఎప్పటికప్పుడు సెట్ ని శానిటైజ్ చేస్తూ మూవీ షూటింగ్ జరుపుతున్నారు.

నానీ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఇంతటి ధైర్యం చేయటానికి ముఖ్య కారణం నిర్మాతల క్షేమం. షూటింగ్ నిలిపి వేస్తే, ప్రవైట్ ప్లేస్ లో మూవీ సెట్ వేస్తే,సెట్ కి అద్దె చెల్లించాల్సి వస్తుంది. నిర్మాతకు ఏమాత్రం భారం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఇంతటి సాహసం తీసుకుంటున్న హీరో నానిని, యూనిట్ ని అందరు మెచ్చుకుంటున్నారు. కలకత్తా సెట్ ని కళా దర్శకుడు అవినాశ్ వాస్తవికత ఉట్టి పడేలా ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్లు టాక్.

అన్ని షూటింగ్ లు బంద్ అయినా.. కానీ నాని సినిమా మాత్రం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts