కార్తీ ‘సర్దార్‌’కు అదే హైలెట్ అట..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కార్తీ ఎప్పుడు సరికొత్తగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తాడు. అలాగే ఈ మూవీలో కూడా న్యూ మేకోవర్‌తో రాబోతున్నాడని కోలీవుడ్‌ వర్గాల టాక్.

ఈ చిత్రంలో తన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేశారు మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, అతి తక్కువ మంది యూనిట్ సభ్యులతో చిత్ర షూటింగ్ సాగిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం మేకర్స్ ఒక భారీ సెంట్రల్ జైలు సెట్‌ను నిర్మించి కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారట. మూవీలో ఈ సన్నివేశాలు చాలా కీలకంగా ఇంకా పెద్ద హైలెట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే కార్తీ సుల్తాన్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు కానీ మూవీ అనుకున్నంత విజయం పొందలేదు. కానీ ఈ చిత్రానికి ఓటిటిలో మంచి రేటింగ్ లభించి వ్యూస్ బనే సంపాదించుకుంటుంది.