జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌.

హైద‌రాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జువెలరీ షాప్లో భారీ చోరీకి దొంగ‌లు చొర‌బ‌డ్డారు. తారా నగర్ తుల్జా భవాని గుడి వద్ద గల రెహన్ జువెలర్స్‌లో శ‌నివారం అర్ధరాత్రి వేళ చొర బడిన దుండగులు షాపులోని 4 లక్షల నగదు ,15కేజీల వెండి 15 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి పోయారు. దొంగలు ఆభరణాల తో పాటు సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డి వి ఆర్ ని కూడా తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. అయితే రోజువారీగా ఉద‌యం వ‌చ్చి షాపు తెరిచిన య‌జ‌మాని జ‌రిగి ఘోరం చూసి వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. షాప్ య‌జ‌మాని ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం తో ఆధారాలు సేక‌రించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.