జూన్ 1 నుంచి కొత్త రూల్స్..తెలుసుకోకుంటే చాలా నష్ట‌పోతారు!

మే నెల పూర్తై జూన్ నెల రాబోతోంది. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. ఈ రూల్స్ ఏంటో తెలుసుకోకుండా.. ప్ర‌జ‌లు చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. మ‌రి అందుకే లేట్ చేయ‌కుండా రానున్న కొత్త నిబంధనలు ఏంటో చూసేయండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఓ విష‌యం తెలుసుకోవాలి. జూన్ 1 నుంచి కొత్త రూల్‌ అమలులోకి రానుంది. రూ.2 ల‌క్ష‌లు ఆపైన విలువ క‌లిగిన చెక్కుల‌ను ఇస్తే వాటిని మార్చేట‌ప్పుడు.. ఖాతాదారులు రీకన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ మీ చెక్‌ను క్లియర్ చేయదు.

గ్యాస్‌ సిలిండర్ విన‌యోగ‌దారులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కేంద్రం ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటుంది. ఈసారి కూడా జూన్‌ 1 నుంచి సిలిండర్ ధరలు మారొచ్చు. అయితే ఒక్కోసారి సిలిండ‌ర్ ధ‌ర‌లు స్థిరంగానే ఉండొచ్చు.

జూన్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, కేవీపీ, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాల‌కు చెందిన వ‌డ్డీ రేట్లు త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

కెనరా బ్యాంక్ కు సంబంధించి కొత్త రూల్ జూన్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు జూన్ 30 తర్వాత పని చేయవు. అంటే జూలై 1 నుంచి కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లను మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.