టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం మాస్ మసాలా హిట్‌గా నిలిచింది. అలాగే రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం కూడా ఇదే.
అయితే ఇప్పుడు ఈ చిత్రంతోనే రామ్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా రామ్ నటించిన ఎ సినిమా అయినా సరే హిందీలోకి డబ్ కావాల్సిందే. హిందీలో టెలివిజన్ ఛానెల్స్ లోనే కాకుండా యూ ట్యూబ్ లో కూడా భారీ రెస్పాన్స్ అందుకుంటాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాను కూడా హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు.
అయితే ఈ చిత్రం యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. తక్కువ సమయంలోనే 20 కోట్ల వ్యూస్ ను దక్కించుకోవడం ఓ రికార్డే. యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ తనలోని మాస్ కోణాన్ని ఆవిష్కరించడంతో.. బాలీవుడ్ జనాలు ఇస్మార్ట్ శంకర్‌ను బాగానే ఆస్వాదిస్తున్నారు. కాగా, రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.