న‌యా లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌..ఫొటో వైర‌ల్‌!

April 6, 2021 at 11:02 am

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ కనిపించ‌నున్నారు.

అలాగే మ‌రోవైపు చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న `ఆచార్య‌` సినిమాలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కించ‌బోయే పాన్ ఇండియా చిత్రంలో చ‌ర‌ణ్ న‌టించ‌నున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ చ‌ర‌ణ్ హెవీ వర్క్ అవుట్ నుంచి ఓ న‌యా ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో కండలు తిరిగిన ఉక్కు దేహంతో చ‌ర‌ణ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. చ‌ర‌ణ్ న‌యా లుక్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

న‌యా లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌..ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts