సైకిల్‌పై ఓటేసేందుకు వ‌చ్చిన విజయ్ ద‌ళపతి‌..వైర‌ల్‌గా వీడియో!

April 6, 2021 at 11:20 am

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కాగా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు.

తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి.. సైకిల్‌పై వ‌చ్చి ఓటు వేశారు. త‌న ఇంటి నుంచి చెన్నై నీలంకరైలోని వెల్స్‌ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్ తొక్కుకుంటూ వ‌చ్చిన విజ‌య్‌.. ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌కు నిర‌స‌న‌గా విజ‌య్ ఇలా సైకిల్‌పై వ‌చ్చాడ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

సైకిల్‌పై ఓటేసేందుకు వ‌చ్చిన విజయ్ ద‌ళపతి‌..వైర‌ల్‌గా వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts