ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పీఎస్‌పీకే 28 మూవీ పోస్ట‌ర్‌ హ‌ల్ చ‌ల్..!

April 25, 2021 at 3:07 pm

అభిమానులు తమ అభిమాన హీరోల‌ను ఆరాధించ‌డ‌మే కాకుండా త‌మ‌ టాలెంట్‌ను యూజ్ చేస్తూ స్ట‌న్నింగ్ పోస్ట‌ర్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పోస్ట‌ర్స్ మూవీ బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ మాదిరిగానే ఉండ‌డంతో అందరు అది నిజ‌మయిన పోస్టర్స్ అని అనుకునేలా ఉన్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న పీఎస్‌పీకే 28కి చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ అంటూ ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

తొమ్మిదేళ్ల తర్వాత పవన్, హరీష్ కాంబోలో PSPK28 అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. తాజాగా పీఎస్‌పీకే 28 ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఈ రేంజ్ లో ఉంటే అఫీసియల్ పోస్టర్ ఎలా ఉంటుందో అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. 2021 ద్వితీయార్థంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పీఎస్‌పీకే 28 మూవీ పోస్ట‌ర్‌ హ‌ల్ చ‌ల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts