పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు.
పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి. ఈ వీడియో చూస్తుంటే భారత్ చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం అనిపిస్తోంది.
ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ సమర్పిస్తోన్న ఈ మూవీని ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, రజిషా విజయన్ ఈ మూవీలో హీరోయిన్లు గా చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/zQp9OQEpS0U” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>