తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?

April 25, 2021 at 3:25 pm

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు.

కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా ఆమె పేర్కోన్నారు. అయితే విద్యా సంవత్సరాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే నిర్ణయాన్ని జూన్ 1న తీసుకుంటారని ఆమె తెలిపారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts