స‌ల్మాన్ సీటీమార్ సాంగ్ వీడియో రిలీజ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రంలో దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన సీటీమార్‌ పాట అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ పాటను సల్మాన్‌ఖాన్‌ నటిస్తోన్న రాధే మూవీ కోసం దేవిశ్రీప్రసాద్‌ రీమిక్స్‌ చేశారు. కొద్ది సేప‌టి క్రితం హిందీ పాట రిలీజ్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ త‌న‌దైన స్టైల్‌లో చేశారు. డీజే మూవీ లోని సీటీమార్‌ సాంగ్ నచ్చడంతో తన మూవీ కోసం ఈ పాటను స్వరపరచమని సల్మాన్‌ఖాన్‌ స్వయంగా దేవిశ్రీప్రసాద్‌ను అడిగారట.

స‌ల్మాన్ ఖాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అల్లు అర్జున్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సాంగ్‌లో మీ ప‌ర్‌ఫార్మెన్స్ బాగా న‌చ్చింది. డ్యాన్స్‌, స్టైల్ అదిరిపోయాయి. ల‌వ్ యూ బ్ర‌ద‌ర్ అని స‌ల్మాన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక స‌ల్మాన్ ట్వీట్‌కు స్పందించి అల్లు అర్జున్, మీ నుండి కాంప్లిమెంట్ అందుకున్నందుకు హ్యాపీ గా ఉంది. థ్యాంక్యూ స‌ల్మాన్ గారు. రాధే స్క్రీన్స్‌ పైన మ్యాజిక్ చేసి అభిమానులంతా మీకు సీటీమార్ వేయాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Thank u Allu arjun for seeti maar absolutely loved the way u have performed in the song, the way u dance, your style, u r simply fantastic.. tk care n b safe. Rgds to ur family .. love u brother @alluarjun#SeetiMaar https://t.co/St8cWOmNKX
— Salman Khan (@BeingSalmanKhan) April 26, 2021