గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్‌ను మరింత వ్యాప్తి చేయటమే అని లేఖలో లోకేష్ తెలిపారు.

పరీక్షల నిర్వహణ పై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను గవర్నర్‌ కి పెట్టారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కరోనా సమయంలో పరీక్షల నిర్వహణ వద్దంటూ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. తమకున్న అధికారాలతో పరీక్షల నిర్వహణ పై జోక్యం చేసుకోవాలని లోకేష్ గవర్నర్ ని కోరారు.