‘ పి ఎస్ వి గ‌రుడ‌వేగ ‘ ఫ‌స్ట్ షో టాక్‌… హిట్టా… ఫ‌ట్టా…!

రాజ‌శేఖ‌ర్ చాలా గ్యాప్ త‌ర్వాత హీరో న‌టించిన సినిమా పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో ఆక‌ర్షించిన ఈ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమాలో అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, స‌న్నిలీయోన్ ఐటెం సాంగ్ ఈ సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ప్ర‌వీణ్ స‌త్తార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా ఫ‌స్టాఫ్ చూసుకుంటే క‌థ‌నం ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో చాలా స్పీడ్‌గా ముందుకు వెళుతుంది. రాజేశేఖ‌ర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారిగా పనిచేస్తుంటాడు. ఓ హ‌త్య‌కు సంబంధించిన కేసును డీల్ చేస్తోన్న టైంలో దాని వెన‌క ఉన్న డ్ర‌గ్ మాఫియా, అక్ర‌మ మైనింగ్‌ల‌లో చీక‌టి కోణాలను బ‌య‌ట పెడ‌తాడు. ఫ‌స్టాఫ్‌లో పైన చెప్పుకున్న అంశాల‌ను రాజశేఖ‌ర్ ద‌ర్యాప్తు చేసే స‌న్నివేశాలు ద‌ర్శ‌కుడు చాలా ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు.

సెకండాఫ్‌లో ప‌లు కీల‌క మ‌లుపులు తిరుగుతుంది. అయితే ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయిన‌ట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్ల‌స్‌ల విష‌యానికి వ‌స్తే క‌థ‌నం, వేగం, ఫ‌స్టాఫ్‌, గ్రాండ్ విజువ‌ల్స్‌, భారీ బ‌డ్జెట్‌, ఉత్కంఠ క‌లిగించే సీన్లుగా చెప్పుకోవ‌చ్చు. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే క‌థ‌నం కాస్త స్లో అవ్వ‌డం చిన్న మైన‌స్‌. చాలా రోజుల త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ట్టే చెపుతున్నారు. ఇక ఏ క్లాస్‌, మ‌ల్టీఫ్లెక్స్ జ‌నాల‌కు బాగా న‌చ్చే ఈ సినిమా, సింగిల్ స్క్రీన్ల‌లో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగు జ‌ర్న‌లిస్టు.కామ్