ఎమ్మెల్యేగా నంద‌మూరి హీరో…. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ..!

ఇటీవ‌ల నిర్మాత‌గా జై ల‌వ‌కుశ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్‌. నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఆయ‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా – బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన జై ల‌వ‌కుశ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబ‌ట్టి క‌ళ్యాణ్‌రామ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్ హీరోగా ప‌దేళ్ల త‌ర్వాత ప‌టాస్ రూపంలో మంచి హిట్ కొట్టాడు. అయితే త‌ర్వాత వ‌చ్చిన షేర్ – ఇజం సినిమాల‌తో ఆ హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయ‌డంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.

ఇజం త‌ర్వాత యేడాదికి పైగా గ్యాప్ తీసుకుని క‌ళ్యాణ్‌రామ్ వ‌రుస‌గా రెండు సినిమాలు ప‌ట్టాలెక్కిస్తున్నాడు. క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యేగా న‌టిస్తోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా నటిస్తున్నారని, పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ఈ సినిమాలో క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. వీర‌భ‌ద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి కుళాయి గుర్తు మీద పోటీ చేసిన క‌ళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వెళ‌తాడు. ఇక వీరభద్రాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళ్యాణ్ రామ్ ప్రచారం నిర్వహిస్తున్న పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌రి ఈ ఎమ్మెల్యే సినిమాతో అయినా క‌ళ్యాణ్ హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తాడేమో ? చూద్దాం.