ఎప్పుడూ కూల్‌గా ఉండే అక్కినేని కింగ్ నాగార్జునకు కోపం వచ్చేసింది. పట్టరాని కోపంతో ఓ యాంకర్‌కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది 2 తాజాగా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో నాగ్, సమంత బిజీబిజీగా ఉన్నారు. గోవాలో అలా పెళ్లి చేసుకుని వచ్చిందో లేదో సమంత కూడా మామ నాగార్జునతో కలిసి ఫుల్లుగా ప్రమోషన్లలో బిజీ అయ్యింది.
ఈ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శ్యామల అడిగిన ఓ ప్రశ్న, నాగార్జునని బాగా ఇబ్బంది పెట్టేసింది. దీంతో నాగ్ కాస్తా సహనం కోల్పోయి శ్యామలకు వార్న్ జారీ చేశాడు. నాగ్‌ను ఉద్దేశించి శ్యామల మీరు మీసాలు తీయడానికి రీజన్ ఏంటి ? అన్న ప్రశ్న వేసింది. ఒక్కసారిగా షాక్ అయిన నాగ్ అందరూ బాగుందని చెపుతుంటే…. మీ రేంటి ? బాగోలేదా ? అని ఆన్సర్ చేశాడు.
వెంటనే శ్యామల ఛఛ అలాంటిదేం లేదు. మీరు చాలా బాగున్నారు… కాకపోతే మన్మధుడికి మీసం ఉంటే రొమాంటిక్‌గా ఉంటుంది కదా ? మీరు చైతుకు పోటీగా వయస్సు తగ్గిద్దామని ట్రై చేస్తున్నారా ? అనడంతో వెంటనే నాగ్ పక్కనే నా కోడలు ఉంది..ఇలాంటి ప్రశ్నలా అడిగేది… బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ శ్యామలకు వార్నింగ్ ఇచ్చినంతగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది.