వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!

వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో ఏంజరుగుతోందో తమ క్యాడరుకి చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని వైస్సార్సీపీ నాయకులూ తెగ బాధపడిపోతున్నారు.

ఇటీవల వైస్ జగన్ ప్రతి విషయంలో ఆత్యంత రహస్యం పాటించటాన్ని పార్టీ నాయకులూ జీర్ణించుకోలేకపోతున్నారు . మరియు పార్టీలో ఎవరని నమ్మటం లేదని వారు చెప్పుతున్నారు .దీనికి నిదర్శనమే ప్రధాని నరేంద్రమోడీ తో వైస్ జగన్ భేటీ అవ్వటం అని చెప్పుతున్నారు . ఎందుకంటే మోడీ తో భేటీ విషయం చివర వరకు నాయకులకు మరియు మీడియాకు  తెలియకుండా జాగ్రత్తపడ్డారు . ముందుగానే ఒక రోజు ముందే ప్రధాని అపాయింట్మెంట్ విషయం జగన్ కు  తెలిసిన  చెప్పలేదని అటు మీడియా ఇటు  వైసీపీ నాయకులూ తెగబాధ పడుతున్నారు .

వైస్ జగన్ భేటీ విషయం తన అంతరంగికులైన మేకపాటి రాజమోహనరెడ్డి ,మిదున్ రెడ్డి మరియు విజయసాయిరెడ్డి కి మాత్రమే తెలియజేసారు వైస్ జగన్ .భేటీకి ఒక అరగంట ముందు మాత్రమే మీడియాకు తెలియజేసారు .తరువాత వారితో ప్రధానిని కలిశారు . ఈ పరిణామంతో పార్టీ నాయకులూ ఒక్క సారిగా షాక్ గురు అయ్యారు . ప్రధాని భేటీ విషయంలో ఇంత గోప్యత పాటించటం ఎందుకని పార్టీలో నాయకులూ చర్చికొంటున్నారు .పైకి భేటీ విషయంలో రహస్యం ఏమిలేదు అని అపాయింట్మెంట్ వచ్చినతరువాతే కలిశాము అని పైకి చెప్పుతున్నారు .వాస్తవాన్ని వైస్ జగన్ కొంత కాలంగా  చాల విషయాలలో  గోప్యతను పాటిస్తున్నారు .

మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాలిసిన వ్యూహాలను ఏ రోజుకు ఆ రోజు చివర నిమషం వరకు సభ్యులకు తెలియపర్చలేదు అని వైసీపీ నాయకులూ చెప్పుతున్నారు .దివంగత నేత భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం లో కూడా తాము సభనుండి బైకాట్ చేస్తున్నాము అని చివరి నిమషం వరకు ఎమ్మెల్యేలకు చెప్పనేలేదు . దీనితో రోజూవారీగానే సభకు హాజరు అయినా ఎమ్మెల్యే లు  సుమారు 14 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు పెట్టారు .అప్పటికే సభకు హాజరు అయినా ఎమ్మెల్యే లకు సంతాప తీర్మానానికి వెళ్లొద్దు అని జగన్ నుండి ఎమ్మెల్యే లకు సమాచారం అందింది .

దీనితో పార్టీలో ఏమి జరుగుతుందో అర్ధంకాక ఎమ్మెల్యే లు తెల్లమొఖం పెట్టారు .దీనితో పాటు అనేక కార్యక్రమాలు పార్టీ నేతలకు తెలియకుండా వైస్ జగన్ జాగ్రత్తపడుతున్నారు .జగన్ వ్యూహాలు పార్టీ నాయకులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు అని పార్టీ లో చర్చ జరుగుతుంది .పార్టీ వ్యూహాలు లీక్ చేస్తారని పార్టీ కార్యక్రమాలు చెప్పకపోతే ఎలా నాయకులూ ప్రశ్నిస్తున్నారు .పరిస్థితి ఇలాగే ఉంటె క్యాడరుకు మా మొహాలు ఎలా చూపించాలని నాయకులూ వాపోతున్నారు .