జ‌న‌సేన‌లోకి మెగాస్టార్‌..? ఆ ఇద్ద‌రు మ‌ధ్య‌వ‌ర్తిత్వం..!

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు టాలీవుడ్‌ను ఓ యేలు యేలుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 9 యేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో త‌న ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక చిరు త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అయితే అన్న ప్ర‌జారాజ్యానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన యువ‌రాజ్యానికి అధ్య‌క్షుడిగా ప‌నిచేసి ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన రాజ‌కీయ పార్టీ స్థాపించాడు.

ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఇక ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిల‌కల్‌గా అట్ట‌ర్‌ప్లాప్ అయిన చిరు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్య‌స‌భ‌కు ఎంపికై, కేంద్ర‌మంత్రి కూడా అయ్యాడు. చిరు ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం న‌చ్చ‌ని ప‌వ‌న్ విబేధించాడు. ఇక ప‌వ‌న్ జ‌న‌సేన స్థాపించ‌డంతో రాజ‌కీయంగా అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ వేర్వేరు అయ్యారు. ఇక ప‌వ‌న్ జ‌న‌సేన 2019లో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. రాజ‌కీయంగా ఈ పార్టీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చిరు జ‌న‌సేన‌లో చేరతాడా ? అన్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం పార్టీ మూడో ఆవిర్భావ‌స‌భ‌లో మాత్రం జ‌న‌సేన‌లో చిరు చేరేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అయినా రాజ‌కీయంగా అన్న‌ద‌మ్ముల‌ను ఒక్క‌టి చేసేందుకు తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల నాటికి చిరు-వ‌ప‌న్ క‌లిపేందుకు ఇద్ద‌రు మీడియా మిత్రులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా వారెవరో అర్థం చేసుకున్నారు జనం.

శ‌నివారం జ‌రిగిన కాట‌మ‌రాయుడు ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు టీవీ 9 ర‌విప్రకాష్ హాజ‌ర‌య్యాడు. ఆయ‌న్ను జ‌నాలు షాక్ తిన్నారు. ప్ర‌సంగంలో అయితే ర‌విప్ర‌కాష్ ప‌వ‌న్‌ను ఇటీవ‌ల పిచ్చ‌పిచ్చ‌గా అభిమానిస్తున్న‌ట్టు చెప్పారు. ఈయనకు తోడుగా ఎన్టీవీ చౌదరి కూడా వచ్చారు. పవన్ రవిప్రకాష్ పక్కపక్కనే కూర్చున్నారు. వీరి ముగ్గురు గుస‌గుస‌లు ఆ ఫంక్ష‌న్‌లో ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఏపీ మీడియా వ‌ర్గాల ఇన్న‌ర్ క‌థ‌నం ప్ర‌కారం ర‌విప్ర‌కాష్ టీవీ9 నుంచి బయటకు వస్తారని.. ఎన్టీవీ నరేంద్ర నాథ్ చౌదరితో కలిసి కొత్త ఛానెల్ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు 2019లో ప‌వ‌న్ జ‌న‌సేన గెలుపుకోసం త‌మ ఛానెల్ ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని కూడా తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రు మీడియా అధినేత‌లు ప‌వ‌న్‌-చిరును క‌లిపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.