కాట‌మ‌రాయుడి క‌త్తి వెనుక స్టోరీ 

`సినిమాలు, రాజ‌కీయాలు రెండింటినీ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డు`… ఇది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఒక ఫంక్ష‌న్లో చెప్పిన డైలాగ్‌!! ఇప్పుడు అన్న చెప్పిన దాన్ని త‌మ్ముడు తూచ త‌ప్ప‌కుండా పాటించేస్తున్నాడు. అటు సినిమాలు చేస్తూ.. అప్పుడ‌ప్పుడూ ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వుతూ.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో.. జ‌న‌సేన‌ను వీలైనంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు స‌రికొత్త వ్యూహాన్ని ఎన్నుకున్నాడు ప‌వ‌న్‌! ముఖ్యంగా పొలిటిక‌ల్ ఇమేజ్ పెరిగేలా ఉండే పాట‌లను త‌న లేటెస్ట్ సినిమా కాట‌మ‌రాయుడులో ఉండేలా చూసుకున్నాడు. క‌త్తి ప‌ట్టుకుని ఉన్న ప‌వ‌న్ పోస్ట‌ర్లోనూ జ‌న‌సేనకు సంబంధించిన సింబ‌ల్‌తో పాటు.. ప‌వ‌న్ చిత్రం కూడా ఉండ‌టం విశేషం!!

`కాట‌మ‌రాయుడు` ఎలా ఉంటుంద‌నేది అంద‌రికీ తెలిసిందే! ఆ పాత్రలో ప‌వ‌న్‌.. ఎలా న‌టిస్తాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇది ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను పెంచేలా ఉండటంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు కూడా ముందుగా లేవు. కానీ టీజ‌ర్‌, పాట‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు ప‌వ‌న్‌!! తెలిసిపోయిన సినిమానే చేయడానికి. ధైర్యం మరేమీ కాదు. కానీ దానికి అద‌న‌పు హంగులు జ‌తచేసి.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా మార్చేశాడు డాలీ.

హీరోగా పవన్ వుండే సీన్లు పెరగడంతో పాటు రెగ్యులర్ హెవీ కమర్షియల్ ఫ్లావర్ వస్తుంది. దర్శకుడు డాలీ, పవన్ కలిసి అదే చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేన అనే పొలిటికల్ పార్టీకి లీడర్ గా పవన్ ఇమేజ్ ను ఎలివేట్ చేసే సీన్లు కూడా జోడించాడ‌ట డాలీ. ఇప్పటికే బయటకు వచ్చిన మిరా మిరా మీసం పాట జనసేన ఫ్లావర్ తో వున్న సంగతి అందరికీ అర్థమైంది. దీంతో ప‌వ‌న్‌ను ఎలివేట్ చేసేలా డైలాగులు.. ఉంటాయ‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే హీరోయిన్ శృతిహాసన్ కూడా మాతృకతో సంబంధం లేకుండా కాటమరాయుడు చాలా మార్చారని అనడం విశేషం,.