ఎమ్మెల్యే కావాలని ఉందా-జగన్ గీతోపదేశం

ఇప్పటికే రెండు పదుల MLA లను చేజార్చుకొన్న YCP అధినేతాన్ YS జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజక వర్గాల్లో కొత్త లీడర్లను తయారు చేసేందుకు వుపక్రమిచారు.అందులో భాగంగా కేడెర్ కి దిశా నిర్దేశం చేసారు.ఎమ్మెల్యే కావాలంటే ఘన మైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీ పీ అధినేత జగన్ అన్నారు. రాజకీయ నాయకు లు అయ్యేందుకు ఒక చక్కని అవకా శాన్ని తాను కల్పిస్తున్నానని ఆయన చెప్పారు.

రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజు కొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే… విజ యం మీ సొంతమవుతుందని ఆయ న తెలి పారు. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరు లీడర్లు అవుతారని ఆయన చెప్పారు.ప్రతి ఇంటికీ వెళ్తే.. మనతో ఉన్నదెవరు, మాటలు చెబుతున్నదెవరు, మన వెంట నడిచేదెవరు? అన్న క్లారీటీ వస్తుందని ఆయన చెప్పారు. ఆ సమయంలో బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, ఇలా వివిధ స్థాయిల్లో ఎవరిని గెలిపించాలో ప్ర జలకు ఓ క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. ఇలా ఆ ఇళ్లకు వెళ్లినప్పుడు వైఎ స్సార్సీపీ ఇచ్చే పాంప్లేట్ ను గడపగడపకు ఇచ్చి, అందులోని ప్రశ్నలకు స మా ధానాలు రాయించడం ద్వారా ప్రజల స్పందన తెలుస్తుందని ఆయన తెలి పా రు. జూలై 8న నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.