ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నపుడు రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్‌ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]

కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?

కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]

సర్కారు ఉద్యోగుల సమ్మె బాట

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక సమస్య తీవ్రమైంది. నిధుల కోసం రాష్ట్రం అన్ని దారులనూ వెతుకుతోంది. ఎక్కడ అవకాశముంటే అక్కడ తీసుకుంటోంది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రతినెలా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా అంతా సంక్షేమ పథకాలకే సరిపోతోంది.. నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన పలు పథకాలకు నిధులు సమకూర్చలేక ఆర్థికశాఖ అవస్థలు పడుతోంది. ఈ ప్రభావం మొత్తం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లపై పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు […]

ఒకచోట వసూలు.. మరోచోట రద్దు

ఓటీఎస్.. వన్ టైం సెటిల్మెంట్.. ఇటీవల మీడియాలో కనిపిస్తున్న పదం ఇది.. ముఖ్యంగా ఏపీ మీడియాలో ఓటీఎస్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది.. ఏమిటీ ఓటీఎస్ అంటే.. ఏపీ హిసింగ్ బోర్డు నుంచి రుణాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొని ఆ తరువాత బకాయిలు లక్షలాది మంది చెల్లించలేదు. అవి అలాగే పేరుకుపోయాయి.. ఇప్పట్లో ఎవరూ చెల్లించే పరిస్తితి కూడా లేదు.. అందుకే ప్రభుత్వం కాస్త డిఫరెంటుగా ఆలోచించి.. తీసుకున్న మొత్తం లబ్ధిదారులు ఎలాగూ కట్టే పరిస్థితి లేదు.. […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]

‘జూనియర్‌’ను ఏమీ అనకండి

తన కుటుంబంపై దాడి జరిగింది.. తనభార్యకు అవమానం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన ఇంకా గుర్తుంది. మహిళలను నిండు సభలోనే అవమానిస్తారా? అని మీడియా ముందు చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రోదన కథను అలాగే కంటిన్యూ చేయాలని టీడీపీ శ్రేణులకు పార్టీనుంచి ఆదేశాలందాయి. భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ నందమూరి కుటుంబసభ్యులు కూడా బయటకు వచ్చి వైసీపీ నాయకుల మాటలను ఖండించారు. ఆ తరువాత […]

నా కన్నీళ్లను ఢిల్లీలో చెప్పండి.. ఎంపీలకు బాబు హుకుం

పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. పార్లమెంటులో ఏయే అంశాలపై మాట్లాడాలో ఆయన వారికి సూచనలు చేశారు. ఇది ప్రతిసారీ జరిగే తంతే. సాధారణంగా ఢిల్లీ పాలనకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఈ సూచనలుగా వస్తుంటాయి. అయితే ఈసారి చంద్రబాబు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అన్నీ.. పార్లముంటలో చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వార్తల్లో […]

మెగాస్టార్ విన్నవించారు.. జగన్ పట్టించుకుంటారా?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలనుంచి విరమించుకున్నాక.. ప్రస్తుతం ఏపీ వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ప్రతిసారీ.. జగన్ నిర్ణయాలను సమర్థించే డైలాగులు రావడమూ.. అలాగే.. జగన్ తో స్నేహపూర్వక భేటీలు ఇలా ఆయన ప్రస్థానం సాగుతోంది. అయితే తాజా విషయంలో మాత్రం.. చిరంజీవి తన విజ్ఞప్తిని జగన్ ముందు ఉంచారు గానీ.. ముఖ్యమంత్రి పట్టించుకుంటారనే నమ్మకం ఎవ్వరికీ కలగడం లేదు. ఏపీలో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడంతో పాటు, టికెట్ ధరలను ప్రభుత్వమే […]

సర్కారు చేతుల్లో ఇక ‘షో’

అనుకున్నదే అయింది.. కాదు అనుకున్నదే చేశారు.. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ప్రభుత్వం కొద్ది రోజులుగా చెబుతోంది. అందుకే టికెట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని జగన్ భావించారు. చాలా రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా.. గుర్రం ఎగురా వచ్చు అని సినిమా పెద్దలు జగన్ వైపు ఆశగా చూశారు. నో.. చాన్స్ జగన్ అనుకున్నాడంటే ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఏపీ సినిమాల […]