సర్కారు చేతుల్లో ఇక ‘షో’

అనుకున్నదే అయింది.. కాదు అనుకున్నదే చేశారు.. థియేటర్లలో ఇష్టానుసారం టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ప్రభుత్వం కొద్ది రోజులుగా చెబుతోంది. అందుకే టికెట్ల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని జగన్ భావించారు. చాలా రోజులుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా.. గుర్రం ఎగురా వచ్చు అని సినిమా పెద్దలు జగన్ వైపు ఆశగా చూశారు. నో.. చాన్స్ జగన్ అనుకున్నాడంటే ట్రిగ్గర్ నొక్కాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు ఎగ్జిక్యూట్ చేశాడు. ఏపీ సినిమాల క్రమబద్దీకరణ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమా పెద్దల స్వరం మూగబోయింది.

ఇక ఇష్టానుసారం బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కుదరదు. రోజుకు నాలుగంటే నాలుగు షోలే.. మేం ఎక్కువ ఖర్చు పెట్టాం.. వారం రోజుల్లో డబ్బు రావాలి.. ఎక్కువ షోలు వేయాలి.. టికెట్ ధరలు పెంచాలి..మేం అనుకున్నట్లే జరగాలి.. అని సినిమా పెద్దలు గతంలో అనునకున్నారు.. వారు అనుకున్నట్లు ప్రభుత్వాలు కూడా చేశాయి. కొందరు పెద్దల వ్యవహారం ముదిరి పాకాన పడటంతో సర్కారుకు చిర్రెత్తుకొచ్చింది. వారు ఆడింది ఆట.. పాడింది పాట అయితే జనం జేబులకు చిల్లలు పడుతూంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రభుత్వం ఆలోచనలో పడింది. అందుకే ఈ బిల్లును అనుకున్న వెంటనే అమలులోకి తెచ్చారు. ఈ బిల్లు అమలైతే ఇక బ్లాక్ టికెట్ అంటూ ఉండదు.. ఇష్టానుసారం బాదుడు అసలే ఉండదు.. ఎంచక్కా ఆన్ లైన్ లో కొని థియేటర్ కు వెళ్లడమే.. ఇపుడు తెలుస్తుంది అసలు సంగతి. ఒక్క రోజులో ఎన్ని కోట్లు వచ్చాయి.. ఎన్ని షోలు వేశారు..అనే విషయాలు.. ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు వల్ల చిన్న బడ్జెట్ సినిమాలు బతుకుతాయి.. చిన్న నిర్మాతలు మరిన్ని సినిమాలు తీస్తారు.. కోట్ల రూపాయలు హీరోకు ఇచ్చాం.. ఆ డబ్బు జనం నుంచి వసూలు చేస్తాం అంటే మాత్రం కుదరదు అని జగన్ బిల్లు రూపంలో కచ్చితంగా చెప్పేశాడు.