బాబు ప్లాన్‌తో జ‌గ‌న్‌కే మేలా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి ఇప్పుడు తీవ్ర వివాదాస్ప‌దం అవుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రైతులు అంద‌రూ త‌న‌కు స‌హ‌క‌రించార‌ని, దాదాపు 33 వేల ఎక‌రాల‌ను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చార‌ని ప్ర‌తి చోటా చెప్పుకొనే చంద్ర‌బాబు.. ఇప్పుడు ఇదే విష‌యంలో ఆంక్ష‌లు విధిస్తున్నార‌నే టాక్ మొద‌లైంది. రైతులు త‌మ ఇష్ట‌ప్ర‌కారం కొంత మేర‌కు మాత్ర‌మే భూములు ఇచ్చార‌ని, మిగిలిన భూముల‌ను ప్ర‌భుత్వం బ‌లవంతంగా ఆక్రమించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు రైతులు ఇటీవ‌ల వైకాపా అధినేత […]

డీఎల్‌పై జ‌గ‌న్ మైండ్‌గేమ్ ?

సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ నాయ‌కులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయ‌డం సాధార‌ణ‌మే! అయితే ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు రాజ‌కీయాల్లో ఉండ‌రు అనే సూక్తిని నిజం చేసేలా క‌నిపిస్తోంది. వైఎస్‌ను, ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను శ‌త్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయ‌కులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో క‌నిపించ‌డం కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది. క‌డ‌ప గ‌డ‌ప‌లో రాజ‌కీయాలు రోజురోజుకీ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. త‌న‌ […]

టాలీవుడ్ సినిమాలో జ‌గ‌న్‌

ఏంటి విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉందా? వైఎస్ జ‌గ‌న్ ఏంటి సినిమాలో న‌టించ‌డ‌మేంటి? అని ఒకింత అవాక్కవుతున్నారా? ఇక్క‌డే ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే.. ఒకే విష‌యాన్ని ప‌దే ప‌దే చూసినా.. దాని గురించి ప‌దే ప‌దే విన్నా వెంట‌నే చిరాకు వ‌స్తుందన‌డంలో సందేహం లేదు! ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల ప‌రిస్థితి.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఒకేలా ఉంది. ఒకే ఫార్ములా క‌థ‌ను వేర్వేరుగా చూడ‌లేక సినీ ప్రేక్ష‌కులు ఇబ్బందులు ప‌డుతుంటే.. ఒకే రీతిలో సాగుతున్న జ‌గ‌న్ […]

హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రీ ఎంట్రీ చేస్తోంద‌ట‌. ఏపీ విప‌క్షం వైకాపాలోకి జంప్ చేయాల‌ని ఆమె ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి స‌న్నాహ‌కంగానే ఆమె ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చిత‌కా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపుల‌ర్ అవ్వాల‌ని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శ‌ల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి […]

ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జ‌గ‌న్ అదిరిపోయే షాక్‌

వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్‌పై జ‌గ‌న్ తీవ్రంగా సీరియ‌స్ అయ్యార‌నే వార్త‌లు చాలా ఆల‌స్యంగా వెలుగు చూశాయి. వాస్త‌వానికి ఎంతో మంది వ్య‌తిరేకిస్తున్నా.. జ‌గ‌న్ అమ‌ర్‌నాథ్‌కి జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఎంద‌రో సీనియ‌ర్ల‌ను కాద‌ని విశాఖ వంటి మేజ‌ర్ సిటీని అమ‌ర్‌నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొద‌ట్లో సౌమ్యంగానే ఉన్న అమ‌ర్‌నాథ్‌.. ఇప్ప‌డు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడ‌ని, దీంతో జ‌గ‌న్ క్లాస్ ఇచ్చాడ‌ని […]

సీఐడీ ఉచ్చులో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు

ప్ర‌తిప‌క్ష వైసీపీకి చుక్క‌లు చూపించేందుకు సీఐడీ సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌ప‌క్క పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ పావులు కదుపుతున్న విష‌యం తెలిసిందే! మ‌రోప‌క్క ఆ పార్టీ బ‌లంగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన‌ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నారు. క‌ల్తీ మ‌ద్యం కేసులో వీరిపై సీబీఐ చార్జిషీటు దాఖ‌లు చేసింది. ఎన్నిక‌ల్లో మ‌ద్యం పంపిణీ చేశార‌ని ఇందులో పేర్కొంది. దీంతో ఏ క్ష‌ణ‌మైనా వీరిని అరెస్టు చేయ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇది వైసీపీలో తీవ్ర […]

లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి బాబు అందుకే ఇవ్వ‌ట్లేదా

ఏపీ అధికార పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ బాబుల‌పై వైకాపా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మాట‌ల‌తో విరుచుకుప‌డింది. గ‌తానికి భిన్నంగా ఇద్ద‌రు నేత‌ల‌ను క లిపి కుమ్మేసింది. చౌక‌బారు విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌పెట్టి.. నిఖార్సైన వ్యాఖ్య‌ల‌తో చించొదిలి పెట్టింది. ఇంత‌కీ రోజా ఏమంద‌నేగా సందేహం.. అక్క‌డికే వ‌చ్చేద్దాం. ఏపీ అధికార పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే రోజా.. తాజాగా త‌న మాట‌ల‌కు మ‌రింత మ‌షాళా అద్ది.. సంచ‌ల‌నం సృష్టించింది. చంద్ర‌బాబుకు లోకేష్ […]

జ‌గ‌న్‌కు ఈడీ టెన్ష‌న్‌… డేట్ ఫిక్స్‌..!

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. అధికార ప‌క్షం అప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు మ‌రోసారి తెర‌తీసింది. దీంతో ఇత‌ర ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అయితే జ‌గ‌న్ ఆశ‌ల‌పై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ నీళ్లు చ‌ల్లేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆయ‌న ఆక్ర‌మాస్తుల కేసులను వేగ‌వంతం చేయాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈడీ పిలుపందుకున్నారు. దీంతో జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొన్నిరోజులుగా స్త‌బ్ధుగా ఉన్న జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు […]

బాబుకు ఓపెన్ షాక్ ఇచ్చిన వైకాపా ఎమ్మెల్యే

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది! దాదాపు రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలంలో క‌నీసం రెండు వేల బ‌హిరంగ స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొని ఉంటార‌ని ఓ అంచ‌నా ఉంది. అలా అన్ని స‌భ‌ల్లోనూ పాల్గొన్నా ఆయ‌న ఏనాడూ కంగు తిన‌లేదు స‌రిక‌దా.. ఆయ‌న మైకుకి, ఆయ‌న మాట‌కు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు క‌దా! అలాగే అన్ని స‌భ‌లూ కూడా ఒకేలా ఉండ‌వు! బ‌హుశ ఈ విష‌యాన్ని బాబు ఊహించి ఉండ‌రు. […]