కన్నడ పవర్ స్టార్ కోసం టాలీవుడ్ పవర్ స్టార్ ఏం చేశాడో తెలుసా.. ఎవరికీ తెలియని షాకింగ్ సీక్రెట్‌..!

మన తెలుగు చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలాగో.. కన్నడ చిత్ర పరిశ్రమకి పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. కన్నడ అగ్ర నటుడు కంఠీరవ రాజ్ కుమార్ చిన్న కొడుకు గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అనతి కాలంలోనే ఆగ్ర హీరోగా మారాడు. కన్నడ పరిశ్రమలో అప్పు అని ప్రేమగా పిలుస్తారు. వరుస విజయాలు అందుకుని కన్నడ చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా […]

వామ్మో..పునీత్‌ స్మారకం వ‌ద్ద‌కు రోజూ అంత మంది వ‌స్తున్నారా?

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29న తీవ్ర‌మైన గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన చెందిన సంగ‌తి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్‌కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అక్టోబరు 31న అంత్యక్రియలు జరిగినప్పటి నుంచీ పునీత్ స్మారకం వ‌ద్ద‌కు ప్ర‌తి రోజు సగటున 30,000 మంది వ‌స్తున్నార‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు ఆయ‌న‌కు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికార‌ని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని […]

పునీత్ నేత్ర‌దానంతో న‌లుగురికి కంటి చూపు..అదెలాగంటే?

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29వ తేదీన క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఇక బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్.. మరణాంత‌రం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పునీత్ ఆకాంక్ష మేర‌కు చనిపోయిన త‌ర్వాత ఆయ‌న రెండు క‌ళ్ల‌నూ కుటుంబీకులు దానం చేసి మంచి మ‌న‌సు చాటుకున్నారు. అయితే ఇప్పుడాయ‌న […]

పునీత్ లేక‌పోయినా ఆ బాధ్య‌త నాదంటున్న హీరో విశాల్‌..!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబ‌ర్ 29న గుండెపోటుతో తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. కన్న‌డ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోగా స‌త్తా చాట‌డ‌మే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ స‌మాజ సేవ‌కుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయ‌న‌. ఎన్నో అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలల‌కు సాయం చేయ‌డ‌మే కాకుండా, 1800 పిల్ల‌లకు ఉచితంగా చ‌దువు చెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేరు. ఈ నేప‌థ్యంలోనే ఆ 1800 పిల్ల‌ల బాధ్య‌తా నాదేనంటూ ముందుకు వ‌చ్చారు హీరో […]

పునీత్ రాజ్‌కుమార్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండె పోటుతో క‌న్నుమూసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ల‌క్ష‌లాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‏కు కడసారి వీడ్కోలు తెలిపారు. ఇక పునీత్ లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకుంటూ.. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా […]

పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర‌ భావోద్వేగం..వీడియో వైర‌ల్‌!

కన్నడ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మ‌ర‌ణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయ‌న కేవ‌లం 46 ఏళ్ల వ‌య‌సులోనే గుండె పోటుతో త‌నువు చాలించ‌డం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది. ఇక ప్ర‌స్తుతం పునీత్‌ను క‌డ‌సారి చూసేందుకు అంద‌రూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో […]

పునీత్‌ను కడసారి చూసి క‌న్నీరు మున్నీరైన‌ బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ‌డానికి ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. `అప్పూ.. మిస్‌.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు. మ‌రోవైపు పునీత్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక‌ కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ […]

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన పునీత్‌..రోదిస్తున్న ఫ్యాన్స్‌!

లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్ రాజ్‌కుమార్‌.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌నే కాదు.. యావ‌ర్ సినీ ప‌రిశ్ర‌మ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్‌.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]

మ‌ర‌ణంపై పునీత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. వింటే క‌న్నీళ్లాగ‌వు!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను హుఠాహుఠిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే ప‌రిస్థితి అప్ప‌టికే చేయి దాట‌డంతో చికిత్స పొందుతూనే పునీత్ తుదిశ్వాస విడిచారు. ఇక పునీత్ మ‌ర‌ణం యావ‌త్‌ సినీ ప‌రిశ్ర‌మ‌నే విషాదంలోకి నెట్టేసింది. మ‌రోవైపు అభిమానులు ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయన భవిష్యత్తు గురించి, మ‌ర‌ణం గురించి చేసిన ఆస‌క్తిక‌ర […]