బాలయ్య పవర్ఫుల్ ప్రాజెక్ట్‌పై మైత్రీ అప్డేట్ అదిరింది!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను క్రాక్‌తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌రూ అంద‌రూ భావించిన‌ట్టుగా ఈ ప‌వ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు క‌న్ఫార్మ్ చేశారు. నేడు బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తూ..ఇంట్రో వీడియోను విడుద‌ల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ […]

ఎన్టీఆర్ జ‌యంతి..మ‌రోసారి త‌న గాత్రంతో బాల‌య్య విశ్వ‌రూపం!

తెలుగు తెరపై తిరుగులేని చెరిగిపోని ముద్ర వేసుకున్నా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తనలోని గాయకున్ని బయట పెట్టే బాలయ్య.. తండ్రి జ‌యంత సంద‌ర్భంగా మ‌రోసారి త‌న గాత్రానికి ప‌ని చెప్పారు. బాల‌య్య స్వ‌యంగా పవిత్ర శ్లోకమైన శ్రీరామదండంకం ని ఆలపించారు. […]

బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా..మే నెల‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ హీరోగా `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. అయితే […]

నంద‌మూరి బాల‌కృష్ణ స‌మ‌ర్పించు…. కొత్త బ్యాన‌ర్ ఇదే

టాలీవుడ్ హీరోల్లో చాలామందికి హోమ్ బ్యానర్స్ ఉన్నాయి. హీరోల‌కు సొంతంగానో లేదా వారి కుటుంబ స‌భ్యుల‌కో నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. నాగ్‌కు అన్న‌పూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉన్నాయి. ఇక మ‌రో అగ్ర‌హీరో బాల‌కృష్ణ కుటుంబానికి సొంత బ్యాన‌ర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. […]

బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంత‌పురం జిల్లా హిందూపూర్ వ‌జ్ర‌పుకోట‌. పార్టీ పెట్టిన ఈ మూడున్న‌ర ద‌శాబ్దాల్లో ఇక్క‌డ పార్టీ ఒక్క‌సారిగా కూడా ఓడిపోలేదు. క‌ర్ణాట‌క‌కు స‌రిహ‌ద్దుల్లో ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో హిందూపూర్ పుర‌పాల‌క సంఘంతో పాటు మండ‌లం, చిల‌మ‌త్తూరు, లేపాక్షి మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 2.16 ల‌క్ష‌లు. ఇక్క‌డ మైనార్టీలు, బీసీల ప్రాబ‌ల్యం ఎక్కువ‌. 1952లో ఆవిర్భ‌వించిన ఈ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]

బాలయ్య చూపు ఆ జిల్లా పైనా!

దివంగత ఎన్టీరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌. టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇక్క‌డ ఆ పార్టీ ఓడిపోలేదు. 2014 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్టీఆర్ వార‌సుడు బాల‌య్య ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బాల‌య్య ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచినా గ‌తంలో త‌న తండ్రికి వ‌చ్చిన మెజార్టీ మాత్రం బాల‌య్య‌కు రాలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రెండేళ్ల‌లో బాల‌య్య బాగానే అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. […]

తమిళనాట బాల‌య్య ప్ర‌భంజ‌నం

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే కేవ‌లం తెలుగుకే ప‌రిమితం. బాల‌య్య సినిమాలు ఎక్కువుగా తెలుగు నేటివిటికి ప‌రిమిత‌మ‌య్యే ఉంటాయి. అలాంటి బాల‌య్య సినిమాకు కోలీవుడ్‌లో సూప‌ర్ క్రేజ్ వ‌స్తోంది. బాల‌య్య కెరీర్‌లో 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా బాల‌య్య కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు ఏకంగ రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర ఆధారంగా […]

బాల‌కృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాల‌కే ప‌రిమిత‌మా?

సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఇక రాజ‌కీయాల‌ను లైట్ తీసుకున్నారా?  సినిమాలే బెట‌ర్ అని భావిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు తాగునీటికి ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నారు. వివిధ ర‌కాలుగా నిర‌స‌న‌లు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్క‌డ అంటూ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. కానీ బాల‌య్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా బాల‌య్య ఎందుకు హిందూపురం రావ‌డంలేదు. అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితులు […]

బాబుకు బాల‌య్య షాక్‌: హిందూపురంకు గుడ్‌బై

ప్రముఖ సినీన‌టుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ రాజ‌కీయంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నాడా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకోనున్నాడా ? బాల‌య్య ఇప్ప‌టికే తీసుకున్న ఈ డెసిష‌న్‌తో చంద్ర‌బాబు సైతం షాక్ అయ్యారా ? అంటే ఏపీ పొలిటిక‌ల్ కారిడాల్ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ వార‌సుడిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా నాలుగు ద‌శాబ్దాలుగా రాణిస్తోన్న బాల‌య్య గ‌త ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ […]