అఖండలో బాలయ్య కాకుండా మెయిన్ హైలెట్ ఇదే..!

December 2, 2021 at 3:14 pm

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవ్వాళ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ముక్తకంఠంతో బాలయ్య అని చెబుతున్నారు.

ఫస్టాఫ్ లో బాలయ్యతో పాటు, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో బాలయ్య ఇరగదీసాడని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాకి మెయిన్ హైలెట్ బాలయ్య అయితే సెకండ్ హైలెట్ తమన్ అని సినిమా చూసి వచ్చిన వారు చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందే అడిగా అడిగా, జై బాలయ్య వంటి పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని అంటున్నారు. బాలయ్య సినిమాకు తొలిసారిగా పనిచేసిన తమన్ తన కెరీర్లోనే తొలిసారిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పెట్టి ఇచ్చాడని అంటున్నారు.

ఫైట్ సీన్స్ లో గానీ, సినిమాలో కీలక సన్నివేశాల్లో గానీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉందని చెబుతున్నారు. సినిమాకు మెయిన్ హైలెట్ బాలయ్య అయితే సెకండ్ హైలెట్ తమనే అని నందమూరి ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈ సినిమాతో విలన్ గా మారిన సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా ఆకట్టుకున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.

అఖండలో బాలయ్య కాకుండా మెయిన్ హైలెట్ ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts