ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహనటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరు పెళ్లి తర్వాత నివసించడానికి విరాట్ కోహ్లీ దంపతులు నివసిస్తున్న అత్యంత ఖరీదైన ఫ్లాట్ లో ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ ఇంటికోసం విక్కీ కౌశల్ సుమారుగా నెలకు ఎనిమిది లక్షల రూపాయలను రెంట్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అపార్ట్మెంట్లో తన ఇంటిని బుక్ చేసుకోవడానికి ఏకంగా కోటి 75 లక్షల రూపాయలను విక్కీ కౌశల్ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారట.
ఇకపోతే విక్కీ కౌశల్ – కత్రినాకైఫ్ ఏడు అడుగులు వేయబోతున్న విషయం తెలిసిందే..కాబట్టి ఇక ఈ అడుగులు వేసేటప్పుడు వచ్చే అతిథులకు ఏడు నియమాలను కూడా విధించారట ఈ కాబోయే దంపతులు. అయితే ఆ నియమాలు ఏమిటో మనం కూడా ఒక సారి చదివి తెలుసుకలకుందాం..
1. మా పెళ్లి వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
2. ఫొటోలు, సెల్ఫీలకు అనుమతి లేదు.
3. పెళ్లికి సంబంధించి ఎలాంటి వివరాలు సోషల్ మీడియా షేర్ చేయకూడదు.
4. వెడ్డింగ్ లొకేషన్ వివరాలు కూడా ఎవరికీ చెప్పకూడదు.
5. వివాహ వేదిక వద్దకు వచ్చాక… బయటి వాళ్లతో కాంటాక్ట్‌లో ఉండకూడదు.
6. వెడ్డింగ్ ప్లానర్స్ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ ఫొటోలు షేర్ చేయొచ్చు
7. వివాహ వేదిక వద్ద ఎలాంటి రీల్స్, స్టోరీస్ చేయకూడదు.
ఈ విషయాలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి.