నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2(నిన్న) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది.
సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ దుమ్మురేపుతోంది. ఇక తన సినిమాను అభిమానులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో బాలయ్య వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. అఖండ మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడ్డారని, కానీ, ఇది కేవలం తమ చిత్ర విజయం కాదని, చలన చిత్ర పరిశ్రమ విజయమని చెప్పారు.
అలాగే ఇంటర్వెల్ సమయంలో తన దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చి అంకుల్ సినిమా అద్భుతంగా ఉందని అన్నారని చెప్పిన బాలకృష్ణ.. తనను ఇలా అంకుల్ అనడం ఏమీ బాలేదని, తనకది నచ్చలేదంటూ ఫన్నీగా ఫైర్ అయ్యారు. దీంతో ఇప్పుడాయన చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా, సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం అఖండనే. ఈ భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 54 కోట్లు వసూళు చేయాలి. ఇక మొదటి రోజు రెస్పాన్స్ చూస్తుంటే బాలయ్య చాలా సులువుగా టార్గెట్‌ను రీచ్ అవుతాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.