ఈ మధ్యకాలంలో జనాలను పట్టి పీడిస్తున్న వ్యాధి షుగర్ వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎంతోమంది మరణించారు కూడా. ఈ వ్యాధికి చక్కటి ఔషధ గుణంగా మన వంటింట్లో దొరికేటువంటి పసుపు పనిచేస్తుందని చెప్పాలి. అలాగే మన ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మేలు చేస్తుంది.పసుపులో ముఖ్యంగా ఫైబర్, ఐరన్, విటమిన్ సి ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియ శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.
అంతేకాదు షుగర్ రాకుండా ఉండడానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఈ పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది.. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఈ పసుపును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక పసుపు లో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో.. ఉసిరికాయ లో కూడా అన్నే పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది..కనుక శరీరంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ఈ విటమిన్ సీ పనిచేస్తుంది. పసుపుతో కలిపి ఉసిరికాయలను తిన్నప్పుడు డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారికి , రోగి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో చాలా ప్రభావితం గా పనిచేస్తాయి.